గ్రామ సింహాలు హల్ చల్ -గ్రామ ప్రజలు బంబేల్
*వీధి కుక్కల దాడిలో ఆరుగురికి గాయాలు
మెంటాడ, న్యూస్: మండలంలో ఎక్కడ చూసినా గ్రామ సింహాలే వాటితో ప్రజలు బెంబేలెత్తు పోతున్నారు. గ్రామంలో ఒంటరిగా వెళ్లాలంటేనే భయం వేస్తుంది. ద్విచక్ర వాహనాలు వెంబడి వీధి కుక్కలు పరుగులు తీస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీధి కుక్కల వలన ప్రజలకు అనేక అనర్ధాలు జరుగుతున్నప్పటికీ ఎన్నోసార్లు మండల అధికారులకు వీధి కుక్కలపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకున్న దాఖలు లేవు. గురువారం మెంటాడ గ్రామంలో ప్రధాన వీధిలో పట్టపగలే ఆరుగురు పై ఆకస్మిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన వారిని స్థానికులు తక్షణమే మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు . మండలంలో అనేక గ్రామాలలో ఇలాంటి ఘటనలు తరచూ పునారవృతం అవుతున్నప్పటికీ అధికారి యంత్రాంగం కుక్కలను నియంత్రించడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నుంచి గ్రామ ప్రజలకు రక్షణ కల్పించేలా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.