logo

నూతన ఎంపీడీవో గా గొల్లపల్లి పార్వతి బాధ్యతలు స్వీకరణ



మెంటాడ, న్యూస్: మెంటాడ మండలం నూతన ఎంపీడీవో గా గొల్లపల్లి పార్వతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె సాలూరు మండలంలో పరిపాలనాధికారిగా విధులు విజయవంతంగా నిర్వహించినందున గొల్లపల్లి పార్వతికి పదోన్నతపై మెంటాడ మండలం ఎంపీడీవో గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు పరిపాల యంత్రాంగం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన పార్వతి మాట్లాడుతూ మెంటాడ మండలం అభివృద్ధిలో బాధ్యతగా పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు సిబ్బంది ఆమెకు పూల గుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు.

0
356 views