logo

గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు.. పవన్ పై రోజా సంచలన కామెంట్స్ !

మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయారన్నారు.
ఒక్కరు కూడా ప్రజలు దగ్గర వెళ్లి ఏం కష్టమో ఆడగరని అన్నారు. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నాయకులు హైదరాబాద్ కు కాదు అమెరికాకు పారిపోతారని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీకెండ్ నాయకులను సంబోధించారు. ప్రజలకు రేషన్ ఇచ్చే వాహనాలకు డబ్బులు లేవు కానీ.. వీళ్లు మాత్రం హెలికాప్టర్, విమానాలలో తిరుగుతున్నారు.

వంద రేట్లు వడ్డీ వేసి చెల్లిస్తాం

వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వందకు వంద రేట్లు వడ్డీ వేసి చెల్లిస్తామని హెచ్చరించారు. నగరిలో నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబు’ కార్యక్రమంలో రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పవన్ కల్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిందని.. ఎక్కడికి వెళితే అక్కడ పుట్టానంటాడు అని రోజా ఎద్దేవా చేశారు. పవన్ ఎక్కడ పుట్టాడు, ఏం చదువుకున్నాడో ఆయనకే తెలియదని విమర్శించారు. రోజా చేసిన ఈ కామెంట్స్ సంచనలంగా మారాయి. రోజా కామెంట్స్ కు టీడీపీ ఎమ్మెల్యే భాను తీవ్ర స్థాయిలో మాట్లాడారు. రెండు వేలకు ఏ పనైనా చేసే ఆమె రూ.2000 కోట్ల సంపాదించి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు వయసెంత, ఆమె వయసెంత గుర్తుంచుకోవాలన్నారు భాను.

0
68 views