logo

*సస్పెండ్ చేసే అధికారం మండల శాఖకు లేదు* *–ఝాన్సీ రెడ్డి ఒంటెద్దు పోకడలు మానుకోవాలి* *– కాంగ్రెస్ బహిష్కృత నాయకుల సమావేశంలో ఖండన

తొర్రూరు,జూలై16(AIMEMEDIA):
కాంగ్రెస్ పార్టీ నియమావళి ప్రకారం పార్టీ మండల స్థాయి నాయకులను సస్పెండ్ చేసే అధికారం మండల కమిటీకి లేదని కాంగ్రెస్ బహిష్కృత నాయకులు స్పష్టం చేశారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ బహిష్కృత నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని గత కొన్నేళ్లుగా అంకితభావంతో పనిచేశామని , పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని గుర్తు చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో వేధింపులు ఎదుర్కొని ...పార్టీని వీడకుండా పనిచేశామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే సంతోషం లేకుండా తమపై లేనిపోని అబాండాలు వేసి సస్పెండ్ చేస్తున్నట్లు మండల కమిటీ ప్రకటించడం విడ్డూరం అన్నారు. పార్టీ నిబంధనల ప్రకారం తొలుత షోకాజ్ నోటీసు ఇవ్వాలని,దానితో సంతృప్తి చెందకుంటే అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. పార్టీ నియమావళికి విరుద్ధంగా ఝాన్సీ రెడ్డి సొంత ఎజెండా అమలు చేస్తూ పార్టీ నాయకులను సస్పెండ్ చేసిన తీరు అభ్యంతరకరమన్నారు.మండల మాజీ అధ్యక్షుడు, ఇతర మండల స్థాయి నాయకులను సస్పెండ్ చేసే అధికారం మండల శాఖకు లేదని స్పష్టం చేశారు. పాలకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగురవేసిన తర్వాత ఝాన్సీ రెడ్డి ఒంటెద్దు పోకడలతో పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడుతుందని తెలిపారు. కష్టకాలంలో పనిచేసిన మాలాంటి నికార్సైన కార్యకర్తలకు అవమానాలే మిగులుతున్నాయని తెలిపారు.ఝాన్సీ రెడ్డి వెనక ఉన్న నాయకులంతా ఆలీబాబా అరడజన్ దొంగలని,వారిని నమ్మి ప్రాణ సమానులైన కార్యకర్తలను పక్కన పెట్టడం బాధాకరమన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తామెక్కడ మాట్లాడలేదని, ఝాన్సీ రెడ్డి వైఖరినే ఎండగట్టామని స్పష్టం చేశారు. తీరు మార్చుకోకపోతే మళ్లీ ఝాన్సీ రెడ్డిని అమెరికా పంపించడం ఖాయమని స్పష్టం చేశారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవడానికి మరో ప్రత్యామ్నాయ నేతను ఎన్నుకుంటామని తేల్చి చెప్పారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు మెరుగు మల్లేశం గౌడ్, నాయకులు చిట్టి మల్ల మహేష్, బాలు నాయక్, తమ్మడపల్లి సంపత్, దేవరకొండ శ్రీనివాస్, ధర్మారపు మహేందర్, జీనుగ రవీందర్ రెడ్డి, ధర్మారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

10
188 views