logo

విజయనగరం: స్వీయ రక్షణే కరోనా నుంచి రక్షణ విశాఖ రేంజ్ డిఐజి శ్రీ ఎల్ కె రంగారావుగారు ఐపీఎస్

విశాఖపట్నం రేంజ్ డిఐజి శ్రీ ఎల్ కె వి రంగారావు గారు ఐ పి ఎస్ ఈరోజు తమ కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు రేంజ్ పరిధిలో కరుణ వ్యాధి చాలా తీవ్రంగా ఉన్నందున ప్రజలందరూ ఇండ్ల కే పరిమితం అవ్వాలని అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు తప్పని పరిస్థితులలో బయటకు రావలసి వస్తే మాస్కు ధరించి వ్యక్తుల మధ్య దూరం పాటించి శానిటైజర్మొదలగునవి తమ వద్ద ఉంచుకోవాలని తెలియజేశారు అలాగే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని వేసుకున్న తర్వాత కోవిద్ రక్షణ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని డిఐజి అన్నారు మీరు తీసుకున్న స్వీయ రక్షణ చర్యల వలన మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకు భద్రత కలుగుతుంది కుటుంబ యజమాని జబ్బు ( కోవిద్) బారిన పడితే ఆ కుటుంబానికి దిక్కు ఎవరు అని ప్రశ్నించారు అందువలన ప్రజలు తమ కోసం కాకుండా తమ కుటుంబం కోసం జాగ్రత్తలు పాటించాలని అన్నారు ప్రస్తుత పరిస్థితులలో పెరుగుతున్న కేసులకు సమాంతరంగా వైద్యం నిమిత్తము తగిన పరికరాలు అన్ని ఆసుపత్రులలో అందుబాటులో లేవని ప్రజలందరూ తెలుసుకోవాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు ప్రజలు గ్రహిస్తూ వాటిని తూచా తప్పకుండా పాటించాలన్నారు ఈ సందర్భంగా వర్తకులు వ్యాపారులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో విధించిన లాక్ డౌన్ సమయం ల లో అన్ని వర్గాల వారు పోలీసు శాఖకు సహకరించినవిదంగా ఈ సమయములో కూడా సహకారాన్ని అందించాలన్నారు పోలీసులు విధించిన కోవిద్ నియంత్రణా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు

126
14671 views
  
12 shares