logo

పాఠశాలల పునర్వ్యవస్థీకరణలోని లోపాలను సవరించండి

నంద్యాల రిపోర్టర్/ మోహన్ (AIMA MEDIA):
పాఠశాలల పునర్వ్యవస్థీకరణ లో భాగంగా పాఠశాల విద్యా శాఖ చేపట్టిన తొమ్మిది రకాల పాఠశాలలు గందరగోళానికి దారితీస్తుందని గతంలో ఉన్న ట్టుగా మూడు రకాల పాఠశాల లు అమలు చేయాలని యుటి ఎఫ్ నంద్యాల జిల్లా శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పి.వి.ప్రసా ద్ జె.సుధాకర్ లు పిలుపు నిచ్చారు.యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా తొమ్మిది రకాల పాఠశాలలను నిరసిస్తూ నంద్యాల జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ తొమ్మిది రకాల పాఠశాలలో ఏ దేశంలో కూడా అమలులో లేవని కానీ మన రాష్ట్రంలో మాత్రం వింత విద్యా విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేస్తూ పాఠశాలలను కుదించి వేస్తూ పోస్టులను విపరీతంగా ఊచకోత కోస్తు న్నారని తద్వారా విద్యపై పెట్టే ఖర్చు తగ్గించుకుంటున్నారని వారు అన్నారు.బదిలీలు జరుపుతామని అదిగో, ఇదిగో అని అంటున్నారు కానీ ఇంతవరకు ఒక జీవో కూడా విడుదల కాలే దని వారు దుయ్యబట్టారు.

0
0 views