logo

ఉచిత కుట్టు మిషన్ శిక్షణ (టైలరింగ్) కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్.

నంద్యాల రిపోర్టర్/ మోహన్ (AIMA MEDIA ): నంద్యాల పట్టణంలో బీసీ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ హై స్కూల్ లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ (టైలరింగ్) కార్యక్రమాన్ని టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ కుట్టు మిషన్ నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశం లభిస్తుందని ఆడవారికి ఇది ఎంతో ఆర్థికంగా ఆసరాగా ఉంటుందన్నారు.బిసి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమంలో ఆసక్తి ఉన్న మహిళలు వారి పేర్లను నమోదు చేసుకొని ఉచిత కుట్టు మిషన్ నేర్చుకోవాలని తెలిపారు. 90 రోజులు ఈ కార్యక్రమం ఉంటుందని,ఎవరికైతే ఈ కార్యక్రమంలో 80 శాతం హాజరు ఉంటుందో వారికి ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.కావున ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుస్సేన్ , కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాల సూపర్వైజర్ బాల హుస్సేన్ , మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం అసదుల్లా ,11వ వార్డు టిడిపి ఇన్చార్జి కట్టెల అఫ్జల్ బాషా , మా భాష ,కరిముల్లా , ఫారత్ , గుర్రప్ప మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు , మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

0
0 views