logo

విజయనగరం: ప్రజల దాహార్తి తీర్చడానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం జిల్లా ఎస్పీ గారు

విజయనగరం:  జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో దిశా మహిళా పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రం ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజకమారి గారు రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ తరపున వేసవికాలం దృష్ట్యా ప్రయాణికులు మరియు దిశ పోలీస్ స్టేషన్ ఫిర్యాదుదారులు యొక్క దాహార్తిని తీర్చేందుకు గాను మహిళా పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం నాడు చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో వేసవి కాలం సందర్భంగా వేడి ఎక్కువగా ఉన్నందున ప్రయాణికులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదుదారులు యొక్క దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించామన్నారు జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసులలో పోలీస్ స్టేషన్ సుమారు 100 మంది వరకు ఫిర్యాదుదారులు వస్తున్నారని వారి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఉపయోగకరంగా ఉంటుందన్నారు అదేవిధంగా ఎత్తు బ్రిడ్జి వద్ద కూడా త్వరలో చలివేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు దిశా పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదుదారులు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్ చల్లని త్రాగునీరు ఎస్పీ గారు అందజేశారు ప్రజలందరూ చలివేంద్రం ఏర్పాటు సద్వినియోగం చేసుకోవాలని కోరారు త్రాగు నీరు లేక పక్షి జాతులు అంతరించి పర్యావరణంలో సమతుల్యత క్షీణిస్తున్న వాతావరణంలో సమతుల్యత సాధించేందుకు పోలీస్ స్టేషన్ ఆవరణలో త్రాగునీరు ఆహారం లభించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో చిన్న చిన్న నీటి తొట్టెలను ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డి.ఎస్.పి త్రినాధ్ గారు ఎస్సై శ్యామల మరియు పోలీస్ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు

131
14665 views
  
10 shares