బంజారాలపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి
వికారాబాద్ జిల్లా కోడంగల్ లో బంజారాల పై జరుగుతున్నా అరాచకాలను ఆపి, అక్కడ ప్రజల పై పెట్టిన కేసులను తీసేసి వాళ్ళని రిలీజ్ చేయాలి లేని యెడల బంజారాల భూమి జోలికి వచ్చిన, బంజారా జాతి జోలికివచ్చిన ఇక నుండి ఊరుకునేది లేదు. బంజారాల జోలికి ఎవరు వచ్చిన సాహించేది లేదు. ఈ రాష్ట్రంలో బంజారాలు ఏకం అవ్వడం కారణంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించాలి.తెలంగాణ రాష్ట్రము లోని నా బంజారా అన్న తమ్ముళ్లకి అక్క చెల్లెలకి, పెద్ద వాళ్లకి అందరికి విన్నవించుకునేది ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఏకం అయ్యే సమయం వచ్చింది కావున మన బంజారా బిడ్డలకి అన్యాయం జరిగితే ఉద్యమమే మొదలు చేయాలనీ కోరుకుంటున్న. తెలంగాణ రాష్ట్రంలో మన జాతి ఉనికిని, మనం కాపాడుకోవాలి. ఈ సమావేశంలో పాల్గొన్న GBSSS రాష్ట్ర అధ్యక్షుడు బాధవత్ బాలాజీ నాయక్, SC/ST విజిలెన్స్ కమిటీ మెంబెర్, KU (KURSA)ప్రెసిడెంట్ భూక్యా ఉషన్ నాయక్, GBSSS గౌరవ అధ్యక్షులు గుగులోత్ వినేష్ నాయక్, పలు గోర్ జాతి సంఘ నాయకులు పాల్గొన్నారు.