logo

హరే కృష్ణ

హరే కృష్ణ

కుమ్మరి వాడు మట్టితో ఎన్నో రకాలు వస్తువులు తయారు చేస్తాడు. ఒక్కో వస్తువుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఎన్ని పేరులు ఉన్నా, ఎన్ని రూపాలు ఉన్నా తయారైంది మొత్తం మట్టిలో నుండే. ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క వైశిష్ట్యం ఉండవచ్చు.కాకపోతే వచ్చినవన్నీ ఆ మట్టిలోనుంచే. పాత్రలో జీవం ఉన్నంతవరకు ఆ పాత్ర పనిచేస్తుంది.లేదా ఆ పాత్ర చేతిలో నుండి జారి పడిందా ఆ పాత్ర పగిలిపోతుంది. అప్పుడు ఆ పాత్ర బయటికి పడవేయ బడుతుంది.దేనికదే పాత్రలు అన్నీ పనిచేస్తూ ఉన్నంతకాలం అనుకుంటాయి, నేనే గొప్పదాన్ని.నేను లేకపోతే వీరికి వండుకుని తినడానికి ఉండదూ అని. మరి అవి పాడైపోయినప్పుడు వాటికి అస్తిత్వం ఉండదు. అసలు మట్టి లేక పోతే పాత్రే తయారు కాదు.ఎంతకాలం ఉన్నా చివరాఖరికి ఆ పాత్ర మరలా మట్టిలో కలవవలసినదే. మరలా ఆ మట్టినుండి కుమ్మరివాడు ఇంకొక పాత్ర తయారు చేస్తాడు.

అదేవిధంగా భగవంతుడు తన నుండి తన ప్రతిబింబంగా ఎన్నో రూపాలతో ఈ భూమి మీదకు మనల్ని పంపించాడు. దేహం ధరించిన మనం ఎన్నో రూపాలతో కనిపించినా మన అందరిలోనున్న చైతన్యం ఒక్కటే. ఆ చైతన్యం మనలో ఉన్నంత కాలం మాత్రమే మన మనుగడ సాగించడం జరుగుతుంది. ఆ చైతన్యం మన నుండి దూరం అవ్వగానే ఈ శరీరాలు అన్నీ పడిపోతాయి . ఈ శరీరాలు అన్నీ ఇంటిలోనుండి బయట పడుకోబెడతాయి. తర్వాత స్మశానానికి పంపించబడతాయి. అంత మాత్రానికే ఈ శరీరం "నేనే" అనుకుని "నేను" ఇంతా "నేను" అంతా అని గొప్పలకి పోతాము. ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో తెలియదు.కానీ ప్రతీ ఒక్కరం శాశ్వతంగా ఉండి పోతామన్నట్లు ప్రవర్తిస్తాం.

శరీరం ఉన్నంత కాలం మన అందరిలో ఉన్న చైతన్యాన్ని గుర్తిస్తూ మనం శరీరాలం కాదు , చైతన్యస్వరూపాలం అని గుర్తెరిగి జీవిస్తే మనకు ఇక నేను నాది అను రాగ ద్వేషాలు,అహంకార మమకారాలు ఉద్భవించవు. కేవలం ఈ శరీరమే "నేను" అని అనుకుంటున్నాను కాబట్టి మాలిన్యాన్ని పులుము కుంటున్నాము. శరీరం ఉంటేనే "నేను " శివం. నా శరీరం పోతే "నేను" శవం అన్న సత్యాన్ని నిరంతరం దృష్టిలో పెట్టుకొని జీవిస్తూ, భగవంతునిపై దృష్టి సారించి జీవించాలి.

కనీసం మట్టి పాత్ర పగిలి పోతే తిరిగి మరలా అదే రకం పాత్ర తయారు చేస్తాడు కుమ్మరువాడు.కానీ ఈ దేహం పడిపోతే భగవంతుడు మరలా ఇదే రూపంతో మరలా ఇదే జన్మలో ఇదే కుటుంబసభ్యుల మధ్య మరలా పుట్టించడు.

మీకు ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే సంప్రదించవచ్చు.
మీ

0
174 views