logo

వీర నారి చాకలి ఐలమ్మ పోరాటం ఇప్పటి తరాలకు స్ఫూర్తి *భద్రాద్రి పాల్వంచ కలెక్టరేట్ లో* *ఘనంగా చాకలి ఐలమ్మ 129 జయంతి వేడుకలు, : ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జితేష్ వి పాటిల్ *రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ముదిగొండ రాంబాబు, చిటికెన ముసలయ్య,

తెలంగాణ స్టేట్::: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ :::(సెప్టెంబర్ 26)
-------------------------------------
*భద్రాద్రి పాల్వంచ కలెక్టరేట్ లో* *ఘనంగా చాకలి ఐలమ్మ 129 జయంతి *

సభలో పాల్గొన్న భద్రాద్రి *కొత్తగూడెం జిల్లా అధ్యక్ష* *కార్యదర్శులు ముదిగొండ* *రాంబాబు చిటికెన ముసలయ్య*

ఈరోజు ది 26- 9 -2024న భద్రాద్రి కలెక్టరేట్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిగొండ రాంబాబు చిటికెన ముసలయ్య పాల్గొన్నారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజకులు పడే సమస్యలైన రజకులపై దాడులు దౌర్జన్యాలు కుల బహిష్కరణలు కించపరిచే సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం రజకులు దీన అవస్థలతో
కాలం వెళ్లబుచ్చుతున్నారు అని ప్రభుత్వం అలాంటి వారిని సంఘాల ద్వారా గుర్తించి వారికి ప్రత్యేక చేయూత ఇవ్వాలని వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో రజకులకు ప్రత్యేకంగా ఆహ్వానించిన సందర్భoగా కృతజ్ఞతలు తెలిపిన రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముదిగొండ రాంబాబు చిటికెన ముసలయ్య సంఘం నాయకులు, సభ్యులు. అనంతరం కలెక్టర్కు తమ సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు

1.50 సంవత్సరాలు నిండిన ప్రతి రజకుడికి పెన్షన్ ఇవ్వాలి

2.ప్రభుత్వం రజకులకు కేటాయించిన పని రజకులకే ఇవ్వాలని కొన్ని జీవోలు గత ప్రభుత్వాలు ఇచ్చి ఉన్నాయని వాటిని కేటాయించాలని విన్నవించడం జరిగింది

అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సగం కట్టడాలతో ఆగిపోయిన మోడరన్ ధోబి ఘాట్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు

ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందిస్తూ రానున్న కాలంలో మీకు ఎటువంటి సమస్యలు వచ్చిన నా దృష్టికి తీసుకురావాలని నేను మీ సమస్యలను పరిష్కరిస్తానని
అన్నారు

ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కాలేజీలు 20 పోస్టులను మీ రజకులతో నింపాలని మీ మీ సంఘం తరపున అభ్యర్థించారు ఆ సీట్లు రజకులతోనే నింపుతామని హామీ ఇవ్వడం జరిగింది

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం బంచన్ దొర కాల్ మొక్కుతా అనే నినాదాలకు సవాల్ చేస్తూ ఆనాటి రేపాక రామచంద్రారెడ్డి దేశ్ ముఖ్ లను ఎదిరించిన వీర నారి చాకలి ఐలమ్మ పోరాటం ఇప్పటి తరాలకు స్ఫూర్తి నింపుతుందంటే మనమందరం గర్వించ దగ్గ విషయమని
10 లక్షల ఎకరాల భూమి పంచిన ఆనాటి చరిత్రత్మక విజయమని అన్నారు ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి చాకలి ఐలమ్మ ని కొనియాడారు ఆమె జీవిత చరిత్ర రానున్న కాలానికి ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి ఇంద్రాణి మరియు ఆఫీస్ స్టాప్,మరియుపాల్వంచ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నంద్యాల వెంకటేశ్వర్లు యాదగిరి, రామ తులసి,బిక్షం,శ్రీను,తాటికొండ రాజు, శ్రీహరి జయరాజు సుధాకర్ రామకృష్ణ కంచర్ల శ్రీనివాస్,నాగయ్య,ఉమా శివ, అరుణ,శాంతి,హేమలత, అంజమ్మ,శోభ,తదితరులు పాల్గొన్నారు.
(9542180167)

96
13182 views