logo

AIMA VIZAG NEWS REPOTING రాజేష్ కుమార్ శర్మ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఆహ్వానము శ్రీ వేదమాత గాయత్రి దేవి

AIMA
VIZAG
NEWS
REPOTING రాజేష్ కుమార్ శర్మ

శ్రీరస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు

ఆహ్వానము
శ్రీ వేదమాత గాయత్రి దేవి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవములు నాయుడుతోట, వేపగుంట, విశాఖపట్నం

శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులతో...

విగ్రహ ప్రతిష్టాపన తేది : 01-06-2022 బుధవారం సమయం: ఉ॥ 8-03 ని॥లకు.


తేది 29-05-2022 ఆదివారము నుండి
తేది 01-06-2022 బుధవారం వరకు

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ విదియ అనగా తేది 01-06-2022 బుధవారం ఉదయం 8 గం||ల 03 ని॥లకు మృగశిర నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు

శ్రీ వేదమాత గాయిత్రి దేవి ఆలయ విగ్రహ, యంత్ర శిఖర స్థిర ప్రతిష్ఠా మహోత్సవము, నాయుడుతోటలో బ్రహ్మశ్రీ మల్లెమణుగుల రవిబాబు గారు, బ్రహ్మశ్రీ కృష్ణ శర్మ గారు, బ్రహ్మశ్రీ బంకుపల్లి మార్కండేయ శర్మ గార్ల ఆధ్వర్యములో జరుపబడును.కావున భక్తులు యావన్మంది ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ గాయిత్రిమాత అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

కార్యక్రమములు వివరములు :

తేది 29-05-2022 ఆదివారము సాయంత్రం 4 గం॥ల నుండి దేవతామూర్తుల తిరువీధి మహోత్సవము (శోభాయాత్ర).

తేది 30-05-2022 సోమవారము ఉదయం 8 గం॥ల నుండి రాత్రి 8 గం||ల వరకు శ్రీ విఘ్నేశ్వర పూజా, పుణ్యహవాచనము, ప్రతిష్టా సంకల్పము, పరిషత్, దీక్షాధారణ, పంచగవ్యప్రాసన, యాగశాల పూజా, ప్రవేశం, వేదికాకుండ సంస్కారములు, అఖండ దీపస్ధాపన, మండపావాహనములు, అంకురార్పణ, జలాధివాసం, అగ్నిప్రతిష్ఠ, మూలమంత్రహోమములు, తీర్ధ ప్రసాదవితరణ.

తేది 31-05-2022 మంగళవారము ఉదయం 8 గం॥ల నుండి రాత్రి 8 గం॥ల వరకు ప్రాతరోపాసన, వేదపారాయణ, సూర్యనమస్కారములు, మహాలింగార్చన, క్షీరాధివాస, పంచామృతాధివాసములు, స్త్రీలచే (ముత్తైదువలచే) సామూహిక కుంకుమార్చనలు, చండిహవనము, ధాన్యాదివాస, | పంచశయ్యాధివాసము, అష్ట దిగ్బలి ప్రదానము, తీర్ధ ప్రసాదవితరణ.

తేది 01-06-2022 బుధవారము ఉదయం 5.30 గం॥ల నుండి | సూక్తహోమములు, కళన్యాసహోమములు, గర్తన్యాసా, యంత్రన్యాస, బీజన్యాస, ధాతున్యాసములు.

ఉదయం 8.03 గం॥లకు విగ్రహ ప్రతిష్ట, చతు: షష్ఠికళావాహన, నేతోన్మేలన, గోవు దర్పణ దర్శనము, మహా పూర్ణాహుతి, ఆశీర్వచనములు, పండిత సత్కారములు జరుపబడును. అదేరోజు అనగా 01-06-2022 బుధవారం మ॥ 11.30 ని॥లకు మహా అన్నసమారాధన కార్యక్రమం జరుపబడును. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాము.

ఈ ఆలయ నిర్మాణనికి ధన మరియు వస్తు రూపేణ సహాయ సహకారములు అందించిన శ్రీ వేదమాత గాయిత్రి దేవి భక్తులకు మరియు గ్రామస్తులకు ఈ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.

శ్రీ గాయిత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం, కృష్ణానగర్, రిజి.నెం. 2748/2000 విశాఖపట్నం - 530029. 5:9866516181, 9949133362.

85
14659 views