logo

AIMA VIZAG పురుషోత్తపురం న్యూస్ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నీ పురుషోత్త

AIMA
VIZAG
పురుషోత్తపురం న్యూస్


ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నీ పురుషోత్తపురం లో అందరికీ అందుబాటులో అందించడం జరిగింది.


ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమంలో భాగంగా గీతం డెంటల్ హాస్పిటల్ వారు వైద్య సేవలను అందించడం జరిగినది.KECA అధినేత సతీష్ కుమార్ గారి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ లో పురుషోత్తపురం 95 వ వార్డ్ ఏరియా లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా విజయ్ కుమార్ గారి బృందం నిర్వహించడం జరిగింది. గీతం డెంటల్ హాస్పిటల్ కోఆర్డినేటర్ కే .ఎన్ .నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వచ్చిన వారికి దగ్గరుండి మెడికల్ చెకప్ చేసి పంపించడం జరిగింది. ఇంతటి కార్యక్రమాన్ని డాక్టర్ సునీల్ గారు గీతం డెంటల్ హాస్పిటల్ ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 9 జూనియర్ డాక్టర్ల బృందం తో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది .దాదాపు 350 మంది పైగా వచ్చి చెక్ చేసుకోవడం జరిగిందని సునీల్ గారు తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వారు నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించమని డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.

44
14654 views