గిరిజన బాలుని విద్యకు విజయనగరం యూత్ ఫౌండేషన్ సహకారం
విజయనగరం జిల్లా, వి. మాడుగుల మండలం, చిన గోరి గడ్డ గ్రామము ఏజెన్సీ ప్రాంతంలోని తండ్రిని కోల్పోయిన కొండ బాబు కి చదువు మీద ఉన్న ఆసక్తిని గమనించి ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి చదువుకొనుటకు విజయనగరం యూత్ ఫౌండేషన్ వారు మానవత్వంతో స్పందించి కొండబాబు చదువు కొరకు పూర్తి ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం యూత్ అధ్యక్షులు షేక్ ఇల్త్ మాస్, సెక్రటరీ అంబులెన్స్ శివ, యూత్ సభ్యులు అనిల్ కుమార్ , అశోక్ కుమార్, అవం తి డైరెక్టర్ కోన ప్రకాష్, పాస్టర్ ప్రసాద్ పాల్గొన్నారు.