logo

కోవిద్ సేవా పురస్కారం ప్రధానోత్సవం.

విజయనగరం జిల్లా: విజయనగరం పట్టణం రెవెన్యూ కల్యాణ మండపంలో ఆగస్టు 24 మంగళవారం నాడు కోవింద్ సేవా పురస్కార ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా విశాఖ జిల్లా రేంజ్ డిఐజి రంగారావు విశిష్ట అధికారులు గా జిల్లా ఎస్పీ ఎం దీపికా పాటిల్ మరియు జిల్లా పౌర వేదిక అధ్యక్షులు బి శెట్టి బాబ్జి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా రేంజ్ డిఐజి ఎల్ కె వి రంగారావ్ మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికించిన కోవిద్-19 2nd వేవ్ లో ప్రజానీకం కకావికలం అయ్యింది అటువంటి భయానక పరిస్థితుల్లో తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి అధికార యంత్రాంగంతో పాటు ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ఎందరో దాతృత్వం కలిగినవారు సేవలు అందించి *కోవిద్ వారియర్స్* గా శ్రమించారు. ఆ త్యాగశీలురి సేవలను గుర్తు చేసుకుంటూ *విజయనగరం యూత్ ఫౌండేషన్* కోవిద్ సేవా పురస్కారాలను అందిస్తున్నారని, ముఖ్యంగా విజయనగరం యూత్ ఫౌండేషన్ స్థాపకుడు షేక్ ఇల్త మాస్ పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కోవిద్ కష్టకాలం సమయంలో కోవిద్ బారినపడి మరణించిన అనాధ శవాలకు యూత్ ఫౌండేషన్ సభ్యుడు అంబులెన్స్ శివ తో కలసి దహన సంస్కారాలు చేసి ఉన్నారనితెలిపారు. మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ విజయనగరం జిల్లా కే పేరు ప్రఖ్యాతలు తేవాలని అభినందించారు. జిల్లా ఎస్పీ ఎం దీపికా పాటిల్ ఐ పి ఎస్ మాట్లాడుతూ విజయనగరం యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు షేక్ ఇల్త మాస్ అన్నార్తుల కోసం మయూరి జంక్షన్ కూడలి లో ఫుడ్ బ్యాంకును స్థాపించి ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం ఆనందదాయకమని మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని విజయనగరం పోలీసుశాఖలో విధులు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. అనంతరం విశాఖ జిల్లా డి ఐ జి ఎల్ కె వి రంగారావు , జిల్లా ఎస్పి ఎమ్ దీపికా పాటిల్ చేతుల మీదుగా స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులకు విజయనగరం యూత్ సభ్యులకు కోవిద్ సేవ పురస్కారం అవార్డులను అందించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా డి ఐ జి ఎల్ కె వి రంగారావు, జిల్లా ఎస్పి దీపికా పాటిల్, పౌర వేదిక అధ్యక్షులు బి శెట్టి బాబ్జి, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు మరియు ప్రజానీకం పాల్గొన్నారు.

5
14671 views
  
4 shares