logo

దిశా యాప్ లో (ఎస్ ఓ ఎస్) బటన్ నొక్కితే క్షణాల్లో మీ ముందు పోలీసులు. జిల్లా ఎస్పి దీపికా పాటిల్

విజయనగరం జిల్లాలో దిశ (ఎస్ ఓ ఎస్ )కు అనూహ్య స్పందన లభిస్తుందని జిల్లా ఎస్పి తెలిపారు. ఆగస్టు 10 మంగళవారం నాడు మహిళల రక్షణకు ప్రతి మహిళా స్మార్ట్ ఫోన్ ల లో దిశాయాప్ఉన్నట్లయితే మీ రక్షణకు మరో మనిషి మీకు తోడుగా ఉన్నట్లేనని జిల్లా ఎస్పీ అన్నారు. దిశా యాప్ పట్ల.మహిళలకు, విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు కు వారితో మమేకం అవుతున్నా మన్నారు. ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించి 3.20 లక్షల మంది స్మార్ట్ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టామన్నారు. గత 25 రోజులలో 1456 టెస్ట్ కాల్స్ వచ్చాయన్నారు. ప్రతి ఫోన్ కాల్ సిబ్బంది స్వీకరించి వివరాలు తెలుసుకొని సంఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించి చర్యలు చేపడుతున్నామన్నారు. దిశ యాప్ కు వచ్చిన కాల్స్ లో చాలా వరకు భర్త వేధిస్తున్నారని మరియు మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నారని ,అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి అన్నారు. 1,విజయనగరం పట్టణంలో ఒక మైనర్ బాలికను పట్టణానికి చెందిన వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన ట్లుగా జూన్ 28 దిశ (ఎస్ ఎస్) కు ఫిర్యాదు రావడంతో 2వ పట్టణ పోలీసులు తక్షణమే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను రక్షించి అతనిపై ఫోక్స్ చట్టం క్రింద కేసు నమోదు చేశారన్నారు. 2,పాచిపెంట కు చెందిన ఒక వ్యక్తి దిశా (ఎస్ ఓ ఎస్) కు ఫిర్యాదు చేస్తూ తన కుమార్తెను ప్రేమ పేరుతో ఒక వ్యక్తి వేధించి మోసగించాడని తెలపడంతో స్పందించిన పోలీసులు అతనిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. కావున మహిళలు, విద్యార్థినులుు, పోలీసుల సహాయాన్ని సకాలంలో పొందాలని జిల్లా ఎస్పి కోరారు.

7
14677 views
  
8 shares