logo

నగర డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఇసరపు రేవతీదేవి.

విజయనగరం: ఆగస్టు 4 బుధవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ను ప్రిసైడింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ నిర్వహించారు

. ఈ ఎన్నికల్లో 36వ, డివిజన్ కార్పోరేటర్ బాలి పద్మావతి మరియు 13 వ, డివిజన్ కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి పేర్లను ప్రతిపాదించారు.

21 వ, డివిజన్ కార్పొరేటర్ కనకల నాగవల్లి రేవతి దేవి పేరును బలపరిచారు. వేరే వ్యక్తి పేరును సమావేశంలో ఎవరు ప్రతిపాదించక పోవడంతో మిగిలిన సభ్యులు రేవతీదేవి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రిసైడింగ్అధికారి ప్రకటించారు. 5 గురు సభ్యులు మినహా మిగిలిన వారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్ర స్వామి హాజరయ్యారు. రేవతీదేవి డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్లు ప్రకటించిన నిమిత్తం ప్రిసైడింగ్ అధికారి మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ గా ఉండే ముచ్చునాగలక్ష్మి ఆకస్మిక మరణం తో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసే నిమిత్తం జరిగిన ఎన్నికలలో రేవతి దేవిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని తెలిపారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారి రేవతి దేవికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. రేవతీదేవి మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనందుకు సహకరించిన ఎమ్మెల్యే కోలగట్ల కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో నమ్మకంతో ఇచ్చిన పదవికి సార్ధకం చేసే విధంగా కృషి చేస్తానని, సభ్యులందరి సహాయ, సహకారం తో నగరాన్ని మరింత అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. నగర మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు పెద్దపీట వేస్తూ అత్యున్నత స్థానాల్లో పదవులను కోలగట్ల అందించారన్నారు. ఈ సమావేశంలో నగర కమిషనర్ ఎస్ ఎస్ వర్మ, సహాయ కమిషనర్ వరప్రసాద రావు, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మరియు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

0
14672 views