logo

ఆకాశాన్నంటుతున్న భవన నిర్మాణ ధరలు

   విజయనగరం:    జూలై 29 గురువారం నాడు బొండపల్లి మండలం, అంబటి వలస గ్రామం లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఇళ్లను అఖిలభారత మానవహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తలి గౌరి నాయుడు పరిశీలించగా లబ్ధిదారులు పలు విన్నపాలను విన్నవించారు. నింగిని తాకుతున్న ధరలతో ఇళ్ల నిర్మాణం ఎలా చేపట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు?.                                                                                                                                                                    ఈ సందర్భంగా కొత్తలి గౌరి నాయుడు మాట్లాడుతూ  700 రూపాయల విలువ ఉన్న రాయి 2200 రూపాయలకు చేరుకుందని, సిమెంట్ బస్తా 220,  రూపాయలు నుంచి 450 రూపాయలకు చేరుకుందని, కూలి ఖర్చు 250 రూపాయల నుంచి 450 రూపాయలకు పెరిగిపవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వము అందజేస్తున్న 1,80,000, రూపాయలు పునాదుల నిర్మాణానికి సరిపోదని, ఇటువంటి సమయంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి  ఇండ్ల నిర్మాణం చేపట్టాలా వద్ద అన్న సందిగ్ధంలో లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక  సహాయాన్ని పెంచే విషయంలో మరొకసారి పునరాలోచించాలని గౌరినాయుడు కోరారు.

9
14670 views
  
3 shares