logo

కోవిద్ 19 మొదటి వ్యాక్సినేషన్ ప్రారంభం, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సముద్రపు రామారావు.

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో గల జరజారావుపేట గ్రామంలో నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎల్.ఎ బడ్డుకొండ అప్పలనాయుడు సూచనలు, సలహాల మేరకు నగర పంచాయతీ వైస్ చైర్ పర్సన్ సముద్రపు రామారావు ఆధ్వర్యంలో కొండవెలగాడ ఫిజికల్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ ఎస్ ఎస్ ప్రశాంత్ రాజు ప్రత్యేక చొరవ తీసుకుని జరజారావుపేట అర్బన్ ఫిజికల్ హెల్త్ సెంటర్ కి 400, డోసులు కేటాయించి నందున అర్బన్ ఫిజికల్ హెల్త్ సెంటర్ అధికారి డాక్టర్ జి వెంకటేష్ పర్యవేక్షణలో హెల్త్ సూపర్ వైజర్ తిరుపతి నాయుడు, ఏ ఎన్ ఎం గౌరీ లక్ష్మి, ఆశ వర్కర్లు సహాయంతో, సచివాలయం సెక్రటరీస్,  వాలంటీర్స్, యువత సేవలతో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది.                                                                                                                                        .                                 ఈ సందర్భంగా నగర పంచాయతీ వైస్ చైర్ పర్సన్ సముద్రపు రామారావు మాట్లాడుతూ ఎంఎల్ఎ బడ్డుకొండ అప్పలనాయుడు   జరజారావుపేట గ్రామానికి 400, డోసులు వ్యాక్సినేషన్ తెప్పించారని  గ్రామంలో 6, వార్డులు  8, వేల జనాభా కలిగి ఉన్నారని ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా అందిస్తామని తెలిపారు. థర్డ్ వేవ్ కోవిద్ ని ఎదుర్కోవడానికి కోవిద్ వ్యాక్సినేషన్ అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. 18 సంవత్సరముల వయస్సు నుండి  60 సంవత్సరాలు పైబడిన వారు కూడా వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించుకోవాలని, గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అలాగే బాలింతలు కూడా తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని తెలియజేశారు. రెండవ డోస్ వ్యాక్సినేషన్ ఎనభై నాలుగు రోజుల తరువాత వేయించుకోవాలని స్పష్టంగా తెలిపారు.   రాష్ట్ర నాగవంశం డైరెక్టర్ మద్దిల వాసు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వేయించు కున్న వారు కూడా  ప్రభుత్వ నిబంధనల మేరకు సామాజిక భౌతిక దూరం పాటించాలని, డబల్ మాస్కులు ముక్కు కు పై వరకు ధరించాలని, శానిటైజర్ తో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి అని తెలియజేశారు.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     ఈకార్యక్రమంలో  18 వ, వార్డు కౌన్సిలర్ నల్లి శ్రీను, 19 వ, వార్డు కౌన్సిలర్ తుమ్ము నారాయణమూర్తి, డి సి సి బి బ్యాంకు ప్రసిడెంట్ పెనుమత్స అప్పలరాజు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు పోలు బోతు నారాయణ మూర్తి, రాష్ట్ర  నాగవంశం డైరెక్టర్ మద్దిల వాసు, యువ నాయకులు అవనాపు విజయ భాస్కర్ రావు, సముద్రపు సత్తిబాబు, వెంకటరమణ, మద్దిల దుర్గారావు, నల్లి శివ, వైయస్సార్ సిపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

6
14672 views
  
15 shares