logo

తైక్వాండో విజేతలకు అభినందించిన డాక్టర్ రవి కృష్ణ.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాలలో ఆదివారం స్థానిక పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో తైక్వాండో సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి, జిల్లా సంఘం ఉపాధ్యక్షులు సర్దార్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఓపెన్ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో బాలకృష్ణ మాస్టర్ శిక్షణలో విజేతలుగా నిలిచిన తైక్వాండో క్రీడాకారులను ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ సోమవారం స్థానిక క్రీడా సమాఖ్య కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులలో ఆత్మస్థైర్యం పెంచుతాయని,ఆత్మవిశ్వాసం ఇనుమడింప చేస్తుందని అన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు నిరంతర సాధన ద్వారా రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. శిక్షణ ఇచ్చిన బాలకృష్ణ మాస్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులు క్రమశిక్షణ తో,నిరంతర సాధన చేసి నైపుణ్యం పెంచుకోవడం క్రీడలలో విజయాలు సాధించడానికి దోహదం చేస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం కార్యదర్శి ఎం.పి.వి. రమణయ్య, కళారాధన కార్యవర్గ సభ్యుడు శివరామిరెడ్డి, బాలకృష్ణ మాస్టర్,పతకాలు సాధించిన గీతామాధురి,గురు సుదక్ష, వైష్ణవి, అస్మా తబసుం, మేఘన,షారుక్ అహ్మద్, విష్ణు, సాయి కృష్ణ మోహన్ ,మహమ్మద్ అయాన్,గురు దశ్వంత్ క్రీడాకారులు పాల్గొన్నారు.

4
475 views