logo

💻 ఇక ఆఫీసయ్యాక నో కాల్స్‌, నో ఈ-మెయిల్స్‌


తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** డిసెంబర్ 9** ఏఐఎంఏ మీడియా ప్రతినిధి**

💻 ఇక ఆఫీసయ్యాక నో కాల్స్‌, నో ఈ-మెయిల్స్‌*

❇️ఉద్యోగుల పని సమయం దాటిన తర్వాత విధి నిర్వహణకు సంబంధించిన ఈ-మెయిల్స్‌, ఫోన్‌ కాల్స్‌కు హాజరు కాకుండా నిరోధించే ఒక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును శుక్రవారం లోక్‌సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు.

❇️ఉద్యోగుల సంక్షేమ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘రైట్‌ టు డిస్‌కనెక్ట్‌ బిల్లు, 2025’ ప్రకారం ప్రతి ఉద్యోగి తన కార్యాలయ పనివేళలు ముగిసిన తర్వాత, సెలవు దినాల్లో విధి నిర్వహణకు సంబంధించిన ఫోన్‌ కాల్స్‌, ఈ-మెయిల్స్‌ లాంటి పనులకు హాజరవ్వనక్కర్లేని హక్కు లభిస్తుంది.

❇️పని వేళలు ముగిసిన తర్వాత కూడా తమకు అప్పగించే పనిని, కాల్స్‌ను వారు తిరస్కరించ వచ్చు. కాగా, రుతుస్రావ కాలంలో మహిళలకు తమ పని ప్రదేశాలలో సౌకర్యాలు, సహాయం అందించే విధంగా మరో ప్రైవేట్‌ బిల్లు రుతు క్రమ ప్రయోజనాల బిల్లు, 2024ను తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ కడియం కావ్య ప్రవేశపెట్టారు. చట్టాలు అవసరమని భావించే అంశాలపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులు ప్రవేశపెట్టవచ్చు.

22
1322 views