logo

మరణించిన హోంగార్డు కుటుంబానికి హోంగార్డుల విరాళం – ఎస్పీ చేతుల మీదుగా చెక్కు అందజేత

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వై. పవన్ కుమార్ రెడ్డి (HG 1022) అనారోగ్యంతో ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు జిల్లాలోని హోంగార్డులు ముందుకొచ్చి తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను విరాళంగా అందించారు. మొత్తం రూ.2,30,000ను సమకూర్చి, ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా ఎస్పీ ధీరజ్ చేతుల మీదుగా పవన్ కుమార్ రెడ్డి తల్లి రాధకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ— సహచరులను కోల్పోవడం పోలీసు కుటుంబానికి బాధాకరమని, ఇలాంటి సమయంలో హోంగార్డులు చూపిన ఐక్యత మానవతా విలువలకు నిదర్శనం అని తెలిపారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

0
0 views