
ఏపీలో సంచలనంగా మారిన ఐఏఎస్ అధికారి కూతురి ఆత్మహత్య
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన రాజేష్ నాయుడు అనే వ్యక్తితో 8 నెలల క్రితం ప్రేమ వివాహం, వివాదాల కారణంగా రెండు నెలల నుండి పుట్టింట్లో ఉంటున్న యువతి
అత్తింటి వేధింపులు కారణమని యువతి తండ్రి ఆరోపణలు, ప్రేమ వివాహం ఇష్టం లేక యువతి తండ్రే హత్య చేశాడని భర్త ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటూ, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన రాజేష్ నాయుడు అనే వ్యక్తిని 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఏపీ ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్న రాముడు కూతురు మాధురి సాహితి బాయి(27) అనే యువతి
రెండు నెలల క్రితం భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకువచ్చిన సదరు ఐఏఎస్ అధికారి
ఈ క్రమంలో సాహితి బాయి నిన్న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, రాజేష్ నాయుడు వేధింపుల కారణంగా మనస్తాపంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసిన చిన్న రాముడు
మరోవైపు తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె గర్భవతిగా ఉందని, ఆమె తల్లిదండ్రులు ఆమెని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజేష్ నాయుడు ఆరోపణలు
తన భార్య మృతదేహం తనకు అప్పగిస్తే తానే అంత్యక్రియలు చేసుకుంటానని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని నంద్యాల ఎస్పీకి వినతి పత్రం అందజేసిన రాజేష్ నాయుడు