logo

మృతుల కుటుంబాలకు 15 లక్షల ఆర్థిక సాయం..

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏకాదశి రోజున జరిగినతొక్కిసలాటలో 9 మంది భక్తులు చనిపోయారు.దీంతో పాటు 16 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌, ఇతర మంత్రులతో కలిసి కాశీబుగ్గ వెళ్లి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున 15 లక్షలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షలు అందజేస్తామన్నారు. తక్షణ ఖర్చుల కోసం మృతుల కుటుంబాలకు 10 వేలు అందచేసామని తెలియచేశారు. ఈ ఘటన పై ప్రధాని కార్యాలయానికి కూడా సమాచారం అందించామ్నారు. వారు కూడా స్పందించి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50 వేల చొప్పున సాయం ప్రకటించారని తెలిపారు. మృతుల్లో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారని.. పార్టీ ప్రమాద భీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు అదనంగా 5 లక్షలు చొప్పున సాయం అందిస్తామని తెలియచేశారు. అలాగే ఈ ఘటన పై సమగ్ర విచారణ జరిపిస్తామని.. భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

0
0 views