logo

జనసేన కార్యకర్త మృతి. నివాళులు అర్పించిన ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి

AIMA న్యూస్ . నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని యేసునాథపురం లో జనసేన కార్యకర్త మాచర్ల నాగన్న శనివారం రోజున బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ తాలూకా జనసేన పార్టీ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి నివాసానికి చేరుకొని పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జనసేన కార్యకర్త మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు నాగన్న చనిపోవడం చాలా బాధగా ఉంది ఈ మధ్యనే అతని భార్య కూడా చనిపోవడం ఒక్కగానొక కొడుకు అనాధగా మిగిలిపోవడం జరిగింది తల్లి, తండ్రి కోల్పోయిన ఆ బాలుడుకు జనసేన పార్టీ మా కుటుంబం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

58
2880 views