logo

తేది:27-9-24. ఆదిలాబాద్ కార్మికుల సమస్యల పరిష్కారం పై సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాని జయప్రదం చేయండి.:IFTU.



నాలుగు లేబర్ కోడ్ లు,మూడు నేర చట్టాల సవరణ రద్దు కై,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్,స్కీం కార్మికులకు కనీస వేతనం 26000 వేలు ఇవ్వాలని,అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కై సెప్టెంబర్ 30న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమం ఇందిరాపార్క్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఆదిలాబాద్ లోని కొమురం భీం భవనంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రదాన కార్యదర్శి బి.వెంకట నారాయణ మాట్లాడుతూ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని స్వదేశీ జాతీయత దేశభక్తి పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆస్తులను సహజ వనరులను ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అమ్మి వారి ఆస్తులు సంపదను పెంచుతుందని అందులో భాగంగానే కార్మిక హక్కులను కాల రాస్తూ ప్రభుత్వ సంస్థలు అన్నిటిని కార్పొరేట్ శక్తులైన ఆదాని,అంబానీ లకు తాకట్టు పెడుతుందని ఆయన అన్నారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను 44 లేబర్ చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా చేసి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని వారన్నారు. అలాగే మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి న్యాయాధికారులకు న్యాయాధికారాలు తగ్గించి, పోలీసు వ్యవస్థకు అధికారాల పెంచిందని దీనితో ఏ పరిశ్రమలో కూడా అడిగే హక్కు లేకుండా చేయడం కోసమే ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చిందని అందులో భాగంగా ప్రశ్నించే సంఘ నాయకులపై పిడి,ఉపా లాంటి కేసులు నమోదు చేస్తున్నారని వారు అన్నారు. నల్ల చట్టాలతో కార్మిక హక్కులను కాలరాస్తూ పెట్టుబడి దారి వ్యవస్థకు కొమ్ము కాస్తూ చట్టాలను తయారు చేశారని వారు అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే విధానాలను అమలు చేస్తుందని వీటిని వ్యతిరేకించాల్సిన అవసరం కార్మిక సంఘాలపై కార్మికులపై ఉందని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పకడ్బందీగా అమలు చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఈ నెల 30న హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద జరిగే భారీ ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు శేషారావు,నర్సింగ్, దేవిదాస్,అఖీల్,జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

విప్లవాభినందనలతో బి.వెంకట నారాయణ
భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐ ఎఫ్ టి యు) ఆదిలాబాద్ జిల్లా కమిటి

0
70 views