logo

AIMA VIZAG NEWS రిపోతింగ్: రాజేష్ కుమార్ శర్మ (పెందుర్తి) గృహ అరెస్టులతో టి.టి.డి కార్మికుల హక్కులను కాలరా

AIMA
VIZAG NEWS
రిపోతింగ్: రాజేష్ కుమార్ శర్మ (పెందుర్తి)

గృహ అరెస్టులతో టి.టి.డి కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తే ప్రభుత్వం టి.టి.డి. యాజమాన్యం తీవ్ర పరిణామాలుని ఎదుర్కోవలిసివస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు వెంకటా చలపతి డిమాండ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు టి.టి.డి అటవీకార్మికులు గత 586 రోజులుగా వారి హక్కుల కోసం నిరసన దీక్షలు చేపడుతున్నా రాష్ట ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.నిన్న తిరుపతిలో సి.ఐ. టి.యు ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మా పార్టీ నుండి తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే ముందుగా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి నుండి గృహ నిర్బంధం చెయ్యడం దారుణమన్నారు ప్రశ్నించే వివిధ రాజకీయ ప్రజా సంఘాల నేతలు ను అరెస్టులు చెయ్యడంమరీ విడ్డురంగా ఉందని తిరుపతిలోని యమ్.బి.భవన్ ఎదుట జరిగిన టి.టి.డి.అటవీ కార్మికుల నిరసన కార్యక్రంలో పాల్గొని కార్మికులకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని తక్షణమే కార్మికుల సమస్యలను పరిస్కారం చెయ్యలేని పక్ష్యంలో తగినమూల్యం ప్రభుత్వం చెల్లించుకోవలసి వస్తుంది అన్నారు.ఈ కార్యక్రంలో తిరుపతి జిల్లా మహిళా కన్వీనర్ యం. నందిని,తిరుపతి నియోజకవర్గ కన్వీనర్ టి.జయకుమార్,చంద్రగిరి నియోజకవర్గ కన్వీనర్ వి.నవీన్ రెడ్డి ,గుడూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు కోడివాక చందు తదితరులు పాల్గొన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ హౌస్ అరెస్ట్ని ఖండించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు వెంకటా చలపతి మరియు విద్యార్థి ,యువజన,ప్రజా సంగాలనేతలు ఈ రోజు తిరుపతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో గత 586 రోజులు నుండి టి.టి.డి అటవవీకార్మికులు వారి హక్కుల కోసం చేటున్న పోరాటానికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇవ్వడంతో నిన్నటి అర్ధరాత్రి నుండి హౌస్ అరెస్ట్ చెయ్యడంతో వారి స్వగృహం నందు బాబా సాహెబ్ అంబెడ్కర్ చిత్రపటం పెట్టుకొని నిరసన దీక్ష చేపట్టారు.తక్షణమే టి.టి.డి అటవీ కార్మికుల సమస్యలను పరిస్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాష్ట్ర సీనియర్ నాయకులు వెంకటా చలపతి ,జిల్లా మహిళా కన్వీనర్ యం. నందిని ,తిరుపతి కన్వీనర్ జయకుమార్,చంద్రగిరి కన్వీనర్ వి.నవీన్ రెడ్డి ,గుడూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు కోడివాక చందు,శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి శంకర్ బాబు మరియు జాతీయ బి.సి జె.ఏ. సి.రాయలసీమ అధ్యక్షులు విజయ్ ఉత్తరాది,విద్యార్థి నాయకులు గురురాజ్,సురేంద్ర,యువజన నాయకులు సురేష్ నాయక్ లు పాల్గొని మద్దతుప
లికారు

హౌస్ అరెస్టులతో కార్మిక ఉద్యమాన్ని ఆపలేరు. టి.టి.డి.అటవీకార్మికులకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుగా ఉంటుంది. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని హౌస్ అరెస్టులో ఉంటూనే శాంతియుతముగా తన స్వగృహంలో బాబా సాహెబ్ అంబెడ్కర్ చిత్రపటం ఎదుట నిరసన దీక్ష చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్

పోలీసులు నిర్బంధంనే రాత్రి నుండి ఇద్దరు చొప్పున 3 షిప్ట్స్లో 6 మందిని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టు నగేష్ బందోబస్ట్ ఇచ్చారు.

13
14656 views