logo

AIMA విజయనగరం, దేశపాత్రునిపాలెం జూన్ 14, 2022 రిపోర్టింగ్: రాజేష్ కుమార్ శర్మ

AIMA
విజయనగరం,
దేశపాత్రునిపాలెం జూన్ 14, 2022
రిపోర్టింగ్: రాజేష్ కుమార్ శర్మ


దేశపాత్రునిపాలెం గ్రామదేవత బంగారమ్మ దేవాలయం లో అర్ధరాత్రి చోరీ,3.5 కేజీల కిరీటం, నగలు చోరీ


కొత్తవలస సమీపంలోని దేశపాత్రునిపాలెం గ్రామాన్ని కాపాడుతున్న అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఆగంతుకుడు ప్రవేశించి అమ్మవారి కిరీటం, నగలు చోరీ చేసినట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలియచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే కొత్తవలస కి వెళ్లే రహదారిపైనే అమ్మవారి ఆలయం లో నిత్యా ఆరాధనలు ముగిసిన తదుపరి గ్రామస్థులు ఆలయం మూసి వేశారు. రాత్రి వేళల్లో ఈ ఆలయంలో విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఈ ఆలయంలో సీసీ కెమెరాలను కూడా అమర్చడం జరిగింది. మంగళవారం ఉదయం ఆలయం తెరిచేందుకు వచ్చిన గ్రామస్తులకు చోరీ విషయం తెలియడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాద చేయడం జరిగింది. విజయనగరం నుంచి పొలిసు డాగ్ బృందాలు వచ్చి ఆలయాన్ని పరిశీలించాయి. సీసీ కెమెరా లోని దృశ్యాలను సేకరించి విచారించనున్నారు. ఈ చోరీలో అమ్మవారి విగ్రహం ఫై 3.5 కిలోల భారీ వెండి కిరీటం, 3 తులాలకు పైగా వెండి నగ, తో పాటు హుండీ లోని సుమారు రూ.5వేల నగదు చోరీకి గురైనట్టు స్థానికులు తెలియచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

11
14658 views
  
1 shares