logo

AIMA వైజాగ్ పెందుర్తి న్యూస్ వైభవంగా బ్రాహ్మణ కళా సంరంభం వైజాగ్ పెందుర్తి నుండి చిత్రలేఖన పోటీల్లో ప్రథమ స్థానాన్

AIMA
వైజాగ్
పెందుర్తి న్యూస్

వైభవంగా బ్రాహ్మణ కళా సంరంభం
వైజాగ్ పెందుర్తి నుండి చిత్రలేఖన పోటీల్లో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న ఏలూరు లలితా లాస్య లహరిక

నాంపల్లి, మే 22 ప్రభాతవార్త బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ వద్దనున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. నందమూరి తారక రామారావు కళామందిరంలో బ్రాహ్మణ కళాసంరంభం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యదర్శి గాంధీ స్వాగతోపన్యాసంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సినీనటుడు ప్రదీప్ ప్రసంగిస్తూ బ్రాహ్మణ సంఘాలలో ఇలాంటి అద్భుత వేడుకలు జరగడం మొదటిసారని, వివిధ కళలలో విద్యార్థులకున్న ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడం గొప్పవిషయమని కొనియా డారు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించినప్పుడే జీవితంలో స్థిరపడే అవకాశముంటుందని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి బాలశ్రీనివాసులు గారు మరియు సెక్రెటరీ మోహన్ కుమార్ గాంధీ గారు మరియు జాయింట్ సెక్రెటరీ అచ్యుతరామ శర్మ గారు మరియు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వైజాగ్ నుండి మీడియా ఇంచార్జ్ ఏలూరు వెంకటరమణ మూర్తి శర్మగారు ఈ కళాసంరంభంలో పాల్గొనడానికి ఉభయ తెలుగురాష్ట్రాల నుండి విశేష స్పందన వచ్చిందని వివరించారు. బ్రాహ్మణ విద్యార్థుల్లో కళానైపుణ్యాన్ని పెంపొందించేందుకు, కళారం గంలో ఆసక్తిని పెంచేందుకు శాస్త్రీయ భారతనాట్య, కూచిపూడి, సంగీతం, చిత్రలేఖనం, వత్కృత్వం, నాదామృతం, భగవద్గీత శ్లోకాలు, తెలుగు పద్యాలు, ఏకపాత్రాభినయం వంటి వివిధరంగాల్లో పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు.వైజాగ్ పెందుర్తి నుండి గవర్నమెంట్ స్కూల్ లో 1క్లాస్ చదువుచున్న ఏలూరు లలిత లాస్య లహరిక చిత్ర లేఖిని లో ప్రధమ స్థానం సాధించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి సినీనటుడు ప్రదీప్, విశిష్ట అతిథులు దైవశర్మ. బాల శ్రీనివాస్, యాదగిరి ఆచార్య, వైద్యురాలు డా. దివ్యమాలిని, వ్యాపారవేత్త మల్లికార్జున,AB6 ఛానల్ విష్ణుదాసు శ్రీకాంత్ గారు, దేవసేన, నాగేంద్రశర్మ, లక్ష్మినర్సింహాచార్యులు, చంద్రశేఖర్, పావని శర్మ, తిరునగరిస్వామి, అచ్చుత్ రామశర్మ. గరుడ న్యూస్ కోఆర్డినేటర్ వైజాగ్ రాజేష్ కుమార్ శర్మ గారు సంస్థ కార్యవర్గ సభ్యులు తదితరుల చేతులమీదుగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విజేతలు 125 మందిని ఘనంగా సత్కరించి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. సభకుముందు జరిగిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.

25
14678 views
  
1 shares