logo

AIMA.                         VIZAG NEWS రిపోర్టింగ్

AIMA.                        
VIZAG NEWS
రిపోర్టింగ్ రాజేష్ కుమార్ శర్మ

21/01/2022


భారతదేశ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని కలసి మెమోరాండం అందించిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఉపాధ్యక్షుడు ఇనుగంటి రాకేష్ శర్మ.

విశాఖపట్నం. పోర్టు గెస్ట్ హౌస్.

 భారతదేశంలో బ్రాహ్మణులకు అవసరమైన సంక్షేమం అట్రాసిటీ చట్టాన్ని కేంద్రం నుంచి ప్రవేశ పెట్టాలని ,AIBF జాతీయ అధ్యక్షుడు DR PRADEEP JYOTHI గారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడ దుర్గాప్రసాద్ గారు,ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ గార్ల సూచన మేరకు ఈ రోజు విశాఖపట్నం పోర్టు గెస్ట్ హౌస్ లో భారతదేశ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని కలసి మెమోరాండం అందించిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఉపాధ్యక్షుడు ఇనుగంటి రాకేష్ శర్మ.

1మెమోరాండం లోని అంశాలు.

విషయం: భారతదేశం లోని బ్రాహ్మణ జాతి అభివృద్ధి, శ్రేయస్సు,సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారితో చర్చించి 50 వేల కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ను కేంద్ర ప్రభుత్వం తో ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.

1.ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న బ్రాహ్మణ నాయకులకు కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలి.

2.ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బదిలీ చేసే విధముగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారిచేయాలి.

3.బ్రాహ్మణ జాతి పైన జరుగుతున్న దాడులను,దూరాగతాలనుభారతదేశ వ్యాప్తంగా అరికట్టుటకు (అట్రాసిటీ ప్రివెన్షన్ ) బ్రాహ్మణ యాక్ట్ ప్రవేశపెట్టి పార్లమెంటులో చట్టం చేయాలి.

స్వాతంత్ర్యం సిద్ధించిన 75 ఏళ్లలో భారతదేశ ప్రధానమంత్రులు గా ఎందరో పనిచేసినప్పటికి ఏ ప్రధానమంత్రి కూడా చేయని విధముగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు, వారణాసి (కాశి షేత్రం) దేవాలయం అభివృద్ధి చేసినందుకు, అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నందుకు యావత్ బ్రాహ్మణ్యం తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

81
17458 views
  
42 shares